Monkey Viral Video: ఈ కోతి వెరీ స్మార్ట్ గురూ.. నీళ్లపై ఎలా వెళ్లిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:21 PM
ఓ కోతి నీళ్లతో నిండిన పొడవాటి కాలువను దాటాల్సి వస్తుంది. ఎలాగైనా కాలువును దాటేయాలని ఫిక్స్ అయిన కోతి చుట్టూ చూస్తుంది. ఇంతలో దానికి కర్రలతో కూడిన పడవ లాంటి వస్తువు కనిపిస్తుంది. దీంతో చివరకు ఏం చేసిందో చూడండి..

కోతి చేష్టలు విచిత్రవిచిత్రంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటి చేష్టలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా మనుషులను అనుకరిస్తూ అవి చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి నీళ్లను దాటుకునే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ కోతి వెరీ స్మార్ట్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి నీళ్లతో నిండిన పొడవాటి కాలువను దాటాల్సి వస్తుంది. ఎలాగైనా కాలువును దాటేయాలని ఫిక్స్ అయిన కోతి చుట్టూ చూస్తుంది. ఇంతలో దానికి కర్రలతో కూడిన పడవ లాంటి వస్తువు కనిపిస్తుంది.
కర్రలను చూసిన కోతి.. వెంటనే దానిపై కూర్చుని పడవను స్టార్ట్ చేసినట్లుగానే చేతులతో ముందుకు తోసి కదిలింది. కొంచెం దూరం వెళ్లగానే తన ముందు కాళ్లను నీళ్లలో అటూ, ఇటూ కదుపుతూ పడవను (Monkey crossing canal on sticks) ఒకవైపు నుంచి మరో వైపునకు సులభంగా చేరుకుంటుంది. అచ్చం మనుషుల్లాగా పడవను నడిపిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: మెల్‌బోర్న్ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పడవను ఇంతకంటే బాగా ఎవరూ నడపలేరేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా లైక్‌లు, 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Viral Video: ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..