Viral Video: వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా.. ఏకంగా చిరుతల ఆహారాన్నే లాగేయడంతో.. చివరకు..
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:08 PM
పులులు, సింహాలను దూరం నుంచి చూసేందుకే కొందరు భయంతో వణికిపోతుంటారు. మరికొందరు బోనుల్లో ఉన్న క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునే ధైర్యం చేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం వాటితో చిన్న పిల్లల తరహాలో ఆటలు ఆడుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
పులులు, సింహాలను దూరం నుంచి చూసేందుకే కొందరు భయంతో వణికిపోతుంటారు. మరికొందరు బోనుల్లో ఉన్న క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునే ధైర్యం చేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం వాటితో చిన్న పిల్లల తరహాలో ఆటలు ఆడుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏకంగా చిరుత పులుల నోటి నుంచి ఆహారాన్ని లాక్కెళ్లారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలోకి వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చిరుత పులులు (Leopards) కనిపిస్తాయి. అప్పటికే ఆ చిరుతలు జింకను పట్టుకుని తినేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే వాటిని చూసిన ఆ ఇద్దరూ చేతిలో కర్రలు పట్టుకుని దగ్గరికి వెళ్తారు. చివరకు ఏకంగా వాటి వద్ద ఉన్న (People stole deer meat) జింక కళేబరాన్ని లాక్కుంటూ పక్కకు తీసుకెళ్తారు.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
జింక మాంసాన్ని లాక్కోవడంతో చిరుత పులులు ఒక్కసారిగా వారి పైకి దాడికి దిగుతాయి. అయితే వారు మాత్రం ఏమాత్రం భయపడకుండా చేతిలోని కర్రలతో వాటిని అదిలిస్తుంటారు. అలా చిరుతలను కర్రలతో బెదిరిస్తూ జింక మాంసాన్ని తీసుకుని దూరంగా వెళ్లిపోతారు. చిరుతపులులు వారిని చూసి గాండిస్తున్నా కూడా.. దాడి చేసేందుకు మాత్రం జంకుతుంటాయి. కర్రతో వారు అదిలించడంతో వెనుకడుగు వేస్తుంటాయి.
Viral Video: కొండచిలువ ఇలాక్కూడా చేస్తుందా.. చెట్టు వద్ద ఏం చేస్తుందో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇలా కేవలం చేతిలో కర్రలతోనే చిరుతలను భయపెట్టిన ఈ వ్యక్తులను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఆఫ్రికాలోని టాంజానియాలో నివసిస్తున్న మసాయి తెగవారికి ఇలాంటి ధైర్య సాహసాలుంటాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీడియోల కోసం ఎంత పని చేశారు.. మేకలను కొండ అంచుపై నీళ్లలోకి తోలడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..