Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:50 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ జింక నిలబడి ఉంది. దాని ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. తనను వేటాడేందుకు పులి ఎక్కడో దాక్కుని ఉందని అనుమానం రావడంతో అలాగే అనుమానంగా చూస్తోంది. జింకకు కనిపించకుండా దాక్కుని ఉన్న పులిని కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నెటిజన్లకు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అయితే కొందరు మాత్రమే అలాంటి పజిల్స్‌ను పరిష్కరించగలుగుతుంటారు.ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల కాలక్షేపం కావడమే కాకుండా మెదడు షార్ప్‌గా మారుతుంది. తాజాగా, మీ కోసం ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో జింకను వేటాడేందుకు ఓ పులి దాక్కుని ఉంది. మీ చూపు చరుగ్గా ఉంటే మాత్రమే ఆ పులిని కనుక్కోగలరు..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ జింక నిలబడి ఉంది. దాని ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. తనను వేటాడేందుకు పులి ఎక్కడో దాక్కుని ఉందని అనుమానం రావడంతో అలాగే అనుమానంగా చూస్తోంది.
ఈ చిత్రం చూస్తే జింక ఎదురుగా చెట్టు, గడ్డి తప్ప ఇంకే జంతువూ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో జింకకు కనిపించకుండా (Hiding Tiger) ఓ పులి దాక్కుని ఉంది. జింకను ఏమార్చి వేటాడేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆ పులి మాత్రం అంత సులభంగా మన కళ్లకు కనిపించదు. అలాగని ఆ పులిని కనుక్కోవడం పెద్ద కష్టం కూడా కాదు.
Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..
చాలా మంది ఆ పులిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే పులిని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పులి ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేల ఇప్పటికీ మీ కళ్లకు కనిపించకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
ఈ చిత్రంలో బాగా గమనిస్తే పులిని ఎంతో సులభంగా గుర్తించవచ్చు. అది ఎక్కడో కాదు.. జింక కొమ్ముల మధ్యలో దాక్కుని ఉంది. ముందుగా అక్కడ పులి కళ్లను మీరు చూడొచ్చు. తదేకంగా గమనిస్తే.. దాని కింద చుట్టూ తల ఆకారం కూడా కనిపిస్తుంది. ఈ పులిని ముందే గుర్తించిన వారంతా చురుకైన చూపుగలవారని అర్థం చేసుకోవచ్చు.
Optical illusion: కేవలం డేగ చూపు గల వారే.. ఇందులో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించగలరు..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..