Viral Video: ఒడ్డున పడ్డ మొసలిని చుట్టు ముట్టిన కుక్కలు.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:38 PM
‘‘నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును’’.. అంటూ వేమన శతకంలో చెప్పినట్లుగా.. నీటిలో ఉన్న మొసలికి ఏనుగును కూడా చంపేయగలదు. అదే ఒడ్డున ఉంటే కుక్క చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడ్డున పడ్డ ఓ మొసలి పరిస్థితి చివరికి ..
‘‘నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును’’.. అంటూ వేమన శతకంలో చెప్పినట్లుగా.. నీటిలో ఉన్న మొసలికి ఏనుగును కూడా చంపేయగలదు. అదే ఒడ్డున ఉంటే కుక్క చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడ్డున పడ్డ ఓ మొసలి పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది. ఒక్కసారిగా రెండు కుక్కలు చుట్టేయడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా వచ్చిందో తెలీదు గానీ ఓ పెద్ద మొసలి ఉన్నట్టుండి నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకుంది. రోడ్డుపై అటూ, ఇటూ తిరుగుతుండగా.. రెండు కుక్కలు దాన్ని గమనిస్తాయి. మొసలిని చూడగానే పరుగెత్తుకుంటూ (Dog attack on crocodile) దగ్గరికి వచ్చి దాడి చేస్తాయి. దీంతో మొసలి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Viral Video: చిరుతపులిపై మొసలి దాడి.. చివరకు జూమ్ చేసిన చూడగా దిమ్మతిరిగే సీన్..
అయితే వాటిని ఏమీ చేయలేని పరిస్థితి ఉండడంతో దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కుక్కలు మాత్రం మొసలిని వదలకుండా కొరికేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా చాలా సేపు మొసలిని ఆ రెండు కుక్కలూ ఓ ఆట ఆడుకుంటాయి. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: గోడ మధ్యలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని పగులగొట్టి చూడగా చివరకు షాకింగ్ సీన్..
‘‘మొసలి నోటిని టేప్‌తో మూసేశారు.. అందుకే ఇబ్బంది పడుతోంది’’.., ‘‘కుక్కలను నియంత్రిచంకుడా అలా వీడియో తీయడం శాడిజం అనిపించుకుంటుంది’’.., ‘‘మొసలి ఒడ్డున ఉంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది’’.., ‘‘టేప్ తీసి ఉండుంటే.. ఏం జరిగేదో తెలిసి ఉండేది’’., ‘‘ఈ మొసలి ఉపవాం చేస్తున్నట్లుగా ఉంది’’.., ‘‘ఎలిగేటర్ దురదతో నవ్వుతున్నట్లుగా ఉంది’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గడ్డ కట్టే చలిలో ఇదేం పని.. ఈ యువతి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..