Viral Video: వీడియోల కోసం ఎంత పని చేశారు.. మేకలను కొండ అంచుపై నీళ్లలోకి తోలడంతో.. చివరకు..
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:07 PM
Watch video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏ పని చేసినా వాటిని వీడియోలుగా మార్చి.. తద్వారా వ్యూస్ కోసం, లైక్‌ల కోసం ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మూగ జీవాలను హింసిస్తూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏ పని చేసినా వాటిని వీడియోలుగా మార్చి.. తద్వారా వ్యూస్ కోసం, లైక్‌ల కోసం ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మూగ జీవాలను హింసిస్తూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు మేకలను కొండ అంచు పైకి తీసుకెళ్లి నీళ్లలోకి తీసుకెళ్లడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు మేకల మందను మేతకు తీసుకెళ్తారు. కొండల్లోకి తీసుకెళ్లిన వారు.. చివరకు వాటిపై తమ శాడిజాన్ని ప్రదర్శించారు. మేకల మందను కొండపై అంచు వరకూ తీసుకెళ్తారు. అక్కడి నుంచి కిందకు జాలువారుతున్న నీటి గుండా ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
ఈ క్రమంలో మేకలను బలంవంతంగా నీటిలోకి తీసుకెళ్తారు. నీటి ప్రవాహాన్ని దాటే క్రమంలో ఓ మేక బ్యాలెన్స్ తప్పి నీటిలో (goat fell from the top of the hill) కొట్టుకుంటూ పైనుంచి కిందకు పడిపోతుంది. అయినా వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా మేకలను నీటిని దాటించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: కొండచిలువ ఇలాక్కూడా చేస్తుందా.. చెట్టు వద్ద ఏం చేస్తుందో చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియోల కోసం మూగజీవాలను ఇలా హింసించడం నేరం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 420కి పైగా లైక్‌లు, 25వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎలుకతో వ్యాపారం.. ఇలాంటి గేమ్ ఎక్కడైనా ఉంటుందా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..