Share News

Viral Video: చిరుతపులిపై మొసలి దాడి.. చివరకు జూమ్ చేసిన చూడగా దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Dec 27 , 2024 | 09:41 PM

మొసలి దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నీళ్లలోని మొసలి నోట పడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. పులులు, సింహాలు వంటి ప్రమాదకర జంతువులు కూడా మొసళ్లకు భయపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు మొసళ్లకు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా..

Viral Video: చిరుతపులిపై మొసలి దాడి.. చివరకు జూమ్ చేసిన చూడగా దిమ్మతిరిగే సీన్..

మొసలి దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నీళ్లలోని మొసలి నోట పడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. పులులు, సింహాలు వంటి ప్రమాదకర జంతువులు కూడా మొసళ్లకు భయపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు మొసళ్లకు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా.. ఓ చిరుతపులి, మొసలి మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చిరుతపై ఓ మొసలి ఊహించని విధంగా దాడి చేసింది. అయితే చివరకు చిరుత చేసిన పనికి మొసలి తోక ముడిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులి దాహం తీర్చుకునేందుకు నది వద్దకు వెళ్లింది. ఒడ్డు నుంచి కాస్త లోపలికి వెళ్లి నీరు తాగుతుండగా.. ఉన్నట్టుండి ఓ మొసలి (Crocodile attack on leopard) దాడి చేసింది. మొసలి ఊహించని దాడితో చిరుత షాక్ అయింది. దాన్నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూడగా.. మొసలి గట్టిగా పట్టుకుంది. దీంతో చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.

Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఒక్కసారి తన పంజాతో మొసలిని నోరు తెరచి పట్టుకుంది. చివరకు దాని దవడలను కాలితో తొక్కిపట్టి చీల్చే ప్రయత్నం చేసింది. దీంతో మొసలికి చుక్కలు కనిపించాయి. ‘‘వామ్మో.. ఈ చిరుతతో అనవసరంగా పెట్టుకున్నానే.. ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్’’.. అని అనుకున్నట్లుగా చిరుత నుంచి తప్పించుకుని (crocodile escaped from leopard) అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


అయితే ఈ వీడియో చూస్తుంటే గ్రాఫిక్స్ చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలికి చుక్కలు చూపించిన చిరుతపులి’’.. అంటూ కొందరు, ‘‘చిరుతపులి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 5.76 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో.. కుక్కలను తప్పించుకోవాలని చూడగా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2024 | 09:41 PM