Viral Video: గోడ మధ్యలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని పగులగొట్టి చూడగా చివరకు షాకింగ్ సీన్..
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:01 PM
కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దేనికోసమో వెతికితే ఇంకేదో కనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు ఇళ్లలోని వివిధ ప్రదేశాల్లో వింత వింత జీవులు బయటపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దేనికోసమో వెతికితే ఇంకేదో కనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు ఇళ్లలోని వివిధ ప్రదేశాల్లో వింత వింత జీవులు బయటపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గోడ మధ్యలో నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో అంతా కంగారుపడ్డారు. చివరకు అందులో ఏముందా.. అని పగులగొట్టి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గోడ పక్క సందులో నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో అంతా భయందోళనకు గురయ్యారు. ఎంత సేపటికీ శబ్ధాలు తగ్గకపోవడంతో.. అందులో ఏముందో కనుక్కునేందుకు సిద్ధమయ్యారు. చివరకు గోడను బద్ధలుకొట్టగా.. (Snakes in the middle of the wall) లోపల నాగుపాములు బుసలుకొడుతూ కనిపించాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
పాములు రెండూ ఒకదానికొటి చుట్టుకుని కనిపించాయి. గోడ పగులొట్టడంతో ఒక్కసారిగా పైకి లేచి బుసలుకొట్టాయి. చివరకు స్నేక్ క్యాచర్ కలుగజేసుకుని వాటిని సురక్షితంగా పట్టుకుని, అడవిలో వదిలిపెట్టారు. ఇలా వింత వింత ప్రదేశాల్లో పాములు కనిపించడం ఇది కొత్తేమీ కాదు. కొన్నిసార్లు మంచం కింద కనిపించి షాక్‌కు గురి చేస్తుంటే.. మరికొన్నిసార్లు ఫ్రిడ్జ్‌లు, కూలర్లలో కనిపిస్తూ అందరినీ కంగారుపెడుతుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే ఏకంగా తలుపుల పైన.. చివరకు ఫాన్ల పైన దర్శనమిస్తుంటాయి.
అయితే తాజాగా, గోడ మధ్యలో కనిపించిన పాముల వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ సీన్ చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘హాని చేయకుంటే.. వాటి దారిన అవి వెళ్లిపోతాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 820కి పైగా లైక్‌లు, 1.14 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..