Train Viral Video: రైలు పట్టాలపై డిటోనేటర్లు.. కారణం తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:52 PM
రైలు పట్టాలపై కొందరు ఆకతాయిలు కోతి చేష్టలు చేయడం చూస్తుంటాం. తాజాగా, రైలు పట్టాలపై ఏకంగా సిబ్బందే డిటోనేటర్లను పెట్టడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే చివరకు కారణం తెలుసుకుని అవాక్కవుతున్నారు..

రైలు పట్టాలపై కొందరు ఆకతాయిలు కోతి చేష్టలు చేయడం చూస్తుంటాం. కొందరు పట్టాలపై రూపాయి కాయిన్స్ పెడితే.. మరికొందరు ఇనుప వస్తువులను పెడుతూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి పనులు చేయడం ప్రమాదమని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైలు పట్టాలపై ఏకంగా సిబ్బందే డిటోనేటర్లను పెట్టడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే చివరకు కారణం తెలుసుకుని అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది రైల్వే సిబ్బంది పట్టాలపైకి చేరుకున్నారు. అంతా కలిసి పట్టాలపై డిటోనేటర్లను అంటిస్తున్నారు. ఇలా రైలు పట్టాలపై వరసగా వాటిని అతికించారు. ఇలా వారంతా కలిసి పదుల సంఖ్యలో డిటోనేటర్లను (Detonators on railway tracks) రైలు పట్టాలపై వరుసగా అతికించారు. కాసేపటికి రైలు అటుగా వచ్చింది. వాటిపై రైలు ఎక్కగానే అన్నీ ఫట్‌మని గట్టిగా శబ్ధం చేస్తూ పేలిపోతున్నాయి.
Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..
స్వయంగా రైల్వే సిబ్బందే ఇలాంటి పని చేయడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత దాని వెనుకున్న అసలు కారణం తెలుసుకుని అవాక్కయ్యారు. రైలు పట్టాలపై వాళ్లు పెట్టినవి ప్రమాదం చేయని క్రాకర్స్ తరహాలోని డిటేనోటర్లని తెలిసింది. పట్టాలపై పొగ మంచు లేదా ఇతర ఏదైనా అడ్డంగి ఉన్న సమయంలో రైలు డ్రైవర్‌కు తెలిసిలా.. సంఘటన స్థలానికి దూరంగా ఇలా క్రాకర్స్ పెడతారట. అవి పేలినిప్పుడు ఎక్కువ శబ్ధం రావడం వల్ల డ్రైవర్‌కు విషయం అర్థమై.. రైలును స్లో చేస్తాడన్నమాట.
కాగా, రైలు పట్టాలపై డిటోనేటర్లను పెట్టిన సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది చాలా మంచి ఐడియా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం మంచిదే అయినా.. దీన్ని చూసి మిగతా వారు కూడా చేసే ప్రమాదం ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..