Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Feb 07 , 2025 | 09:54 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వేటగాడు చేతిలో గొడ్డలి పట్టుకుని అడవిలో నడుస్తూ వెళ్తుంటాడు. తలపై టోపీ పెట్టుకున్న అతడి భుజంపై ఓ గద్ద కూడా వాలి ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో దాక్కుని ఉన్న మరో మనిషి ముఖాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ చిత్రాలు మన కంటి చూపునకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కొన్ని ఫజిల్ చిత్రాలైతే సమాధానం దొరకని ప్రశ్నలా మిగిలిపోతుంటాయి. అయినా చాలా మంది అలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవడం వల్ల మనలో మేథోశక్తి పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కుని ఉన్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వేటగాడు చేతిలో గొడ్డలి పట్టుకుని అడవిలో నడుస్తూ వెళ్తుంటాడు. తలపై టోపీ పెట్టుకున్న అతడి భుజంపై ఓ గద్ద కూడా వాలి ఉంటుంది. వేటాడటం కోసం వెతుకుతున్న అతను.. దూరంగా జంతువులేమైనా ఉన్నాయా.. అనుకుంటూ వెతుకుతుంటాడు.
అతడికి వెనుక పెద్ద పెద్ద వృక్షాలను చూడొచ్చు. అలాగే పెద్ద రాళ్లు కూడా ఉంటాయి. ఆ పక్కనే ఓ సరస్సు కూడా ఉంటుంది. ఆకాశంలో మేఘాల మధ్యలో ఓ పక్షి కూడా ఎగురుతూ ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో ఒక్క వేటగాడు తప్ప ఇంకెవరూ లేనట్లు అనిపిస్తుంది.
Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..
కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో మరో వ్యక్తి కూడా (Man In Hiding) దాక్కుని ఉంటాడు. అయితే ఆ వ్యక్తి అంత సులభంగా మీ కంటికి కనిపించడు. అలాగని అతన్ని గుర్తించడం అంత పెద్ద కష్టమేమీ కాదు కూడా. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అతన్ని ఇట్టే కనిపెట్టవచ్చు.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
ఈ చిత్రంలో దాక్కున్న ఆ వ్యక్తిని గుర్తించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే కనిపెట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆ వ్యక్తిని గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..