Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 07:13 PM
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో బాగా చదువుకున్న వారి దగ్గరి నుంచి చదువు రాని కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకూ ఫోన్లలోనే గడుపుతున్నారు. కొందరైతే ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా ఫోన్ పిచ్చిలో పడిపోతున్నారు. ఈ క్రమంలో..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో బాగా చదువుకున్న వారి దగ్గరి నుంచి చదువు రాని కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకూ ఫోన్లలోనే గడుపుతున్నారు. కొందరైతే ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా ఫోన్ పిచ్చిలో పడిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫోన్‌కు అలవాటు పడిన పిల్లాడు.. చివరకు ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నిద్రపోతున్న ఓ పిల్లాడు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. నిద్రలో ఉన్న ఆ పిల్లాడు మధ్యలో మధ్యలో గట్టిగా అరుస్తూ ఎవరినో తిడుతున్నాడు. అంతలోనే మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నాడు. ఆ వెంటనే మళ్లీ గట్టిగా (child screams in sleep) అరుస్తూ పాటలు కూడా పాడుతున్నాడు.
Train Viral Video: రైలు పట్టాలపై డిటోనేటర్లు.. కారణం తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..
ఇలా ఆ పిల్లాడు చాలా సేపు వరకూ అరుస్తూ, తిగుడూ, పాటలు పాడుతూ ఉండడం చూసి అంతా భయాందోళన చెందారు. బాలుడి కుటుంబ సభ్యులు చుట్టూ చేరి, అతన్ని చేతులు పట్టుకుని ఓదార్చుతున్నారు. మరికొదరు తడిబట్టతో అతడి మొఖాన్ని శుభ్రం చేస్తున్నారు. అయినా ఆ పిల్లాడు మాత్రం ఇలా మధ్యలో మధ్యలో పూనకం వచ్చిన వాడిలా అరుస్తున్నాడు. పిల్లాడి కాలికి కట్టు కట్టి ఉండడాన్ని కూడా వీడియోలో చూడొచ్చు.
Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లలకు ఫోన్లు ఇస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచడం మంచిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..