Viral Video: ప్రియుడి కోసం రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జ్‌పైకి ఎక్కిన యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:22 PM
ప్రేమలో ఫెయిలైన యువతి నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడున్న బ్రిడ్జ్ పైకి ఎక్కేసింది. రైలు రాగానే పైనుంచి కిందకు దూకేయాలని చూస్తోంది. అయితే ఇంతలో అక్కడున్న వారు గమనించి, కిందకు దిగాలంటూ ఆమెను కోరారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు ప్రియుడు ప్రియురాలికి మోసం చేస్తే.. మరికొన్నిసార్లు ప్రియురాలే ప్రియుడిని మోసం చేసి మరొకరిని ఇష్టపడడం జరుగుతుంటుంది. మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బలవంతంగా వేరే వారికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు యువతీయువకులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ప్రియుడి కోసం రైల్వే స్టేషన్‌లోని బ్రిడ్జి పైకి ఎక్కింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో తెలిపిన ప్రకారం.. ప్రేమలో ఫెయిలైన యువతి నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడున్న బ్రిడ్జ్ (young woman climbed on the bridge) పైకి ఎక్కేసింది. రైలు రాగానే పైనుంచి కిందకు దూకేయాలని చూస్తోంది. అయితే ఇంతలో అక్కడున్న వారు గమనించి, కిందకు దిగాలంటూ ఆమెను కోరారు.
అయితే ఆమె మాత్రం వారి మాట వినకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో రైల్వే సిబ్బందితో పాటూ స్థానికులు స్పందించి కింద దుప్పటి పట్టుకుని నిలబడ్డారు. అదే సమయంలో మరికొందరు నిచ్చెన వేసుకుని బ్రిడ్జి పైకి ఎక్కారు. వారిని చూసి ఆమె ఏడుస్తూ దూరంగా జరగుతూ ఉంది. కిందకు దూకేసే సమయంలో పైకి ఎక్కిన వ్యక్తి ఆమె చేయిని పట్టుకున్నాడు. ఇంతలో మరో వ్యక్తి కిందకు దిగి యువతి వద్దకు వచ్చి పట్టుకున్నాడు. తర్వాత అంతా కలిసి ఆమె నడుముకు తాడు కట్టి పైకి లాగేశారు.
Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇలా ఎట్టకేలకు ఆమె కింద పడకుండా కాపాడగలిగారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రేమ కంటే జీవితం ముఖ్యం.. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్న వాళ్ల ఇలా చేయరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 8 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..