Viral Video: చూసేందుకు పిచ్చివాడైనా.. చేసిన పని చూస్తే.. శభాష్ అనాల్సిందే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 09:41 AM
మురికి బట్టలతో పిచ్చివాడిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి ఉన్నాడు. వాహనాలు రద్దీగా తిరుగుతున్నా కూడా రోడ్డుకు ఓ వైపు నిలబడి ఉన్నాడు. ఇంతలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు పైకి హుందాగా కనిపిస్తున్నా లోపల మాత్రం నేర స్వభావాన్ని కలిగి ఉంటారు. దర్జాగా వచ్చి పట్టపగలు చోరీలు చేసే వారిని చూస్తున్నాం. అలాగే పైకి ఎంతో మంచి వారిలా కనిపిస్తూ మహిళలపై శాడిజం చూపించే వారిని కూడా చూస్తున్నాం. మరోవైపు చూసేందుకు దొంగలు, పిచ్చివాళ్లలా కనిపించినా కొందరిలో మానవత్వం కనిపిస్తుంటుంది. ఇందకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిచ్చివాడు రోడ్డుపై ఉండగా ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మురికి బట్టలతో పిచ్చివాడిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి ఉన్నాడు. వాహనాలు రద్దీగా తిరుగుతున్నా కూడా రోడ్డుకు ఓ వైపు నిలబడి ఉన్నాడు. ఇంతలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఓ మహిళ చేతిలో పిల్లడితో ఉంది.
వాళ్లను చూడగానే ఆ పిచ్చివాడ దగ్గరికి వెళ్లి వారు రోడ్డు దాటేందుకు సాయం చేశాడు. మొదట అతన్ని చూడగానే భయపడి ఆగిపోయిన మహిళలు.. అతను వాహనాలు ఆపుతూ రోడ్డు దాటమని చెబుతుండడంతో చివరకు ధైర్యం చేసి రోడ్డు దాటేశారు. వాహనాలను ఆపుతూ ఆ మహిళలను (madman helped women cross road) దగ్గరుండి మరీ ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటించాడు. ఇతడి మానవత్వాన్ని గమనించిన స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: టెంట్ కింద పంట కోత.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూసేందుకు పిచ్చివాడైనా.. మానవత్వంలో ఎంతో గొప్పవాడు’’.. అంటూ కొందరు, ‘‘మహిళలకు ఇతను ఇచ్చిన గౌరవం మరువలేనిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 2.84 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..