Share News

Crocodile Attack Video: వామ్మో.. నీటిలో మొసలి కంట పడ్డ వ్యక్తి.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:31 PM

ఓ వ్యక్తి రోడ్డున పక్కన చెరువులో స్నానం చేస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ పెద్ద మొసలి అతన్ని గమనించింది. అతన్ని చూడగానే ..

Crocodile Attack Video: వామ్మో.. నీటిలో మొసలి కంట పడ్డ వ్యక్తి.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

అడవిలో పులులు, సింహాల కంట పడినా, నీటిలో మొసలి కంట పడినా ఇక దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. మనిషైనా, జంతువైనా వాటికి ఆహారమైపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు మాత్రం సినిమా తరహా మిరాకిల్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీటిలో మొసలి కంటపడ్డాడు. చివరకు జరిగింది చూసి అంతా అవాక్కవుతన్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డున పక్కన చెరువలో స్నానం చేస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ పెద్ద మొసలి అతన్ని గమనించింది. అతన్ని చూడగానే మొసలి వేగంగా (Crocodile chasing man in water) వెళ్లి దాడి చేయాలని చూసింది.

Viral Video: ఇలాంటి శాడిస్టును ఏం చేయాలో చెప్పండి.. యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించడంతో..


అయితే మొసలి తన వైపు రావడాన్ని చూసిన ఆ వ్యక్తి.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా ఈదుతూ వెళ్లాడు. మొసలి కూడా అంతే వేగంతో ఈదుతూ అతడిని తినేయాలని చూసింది. అయితే ఆ వ్యక్తి తన శక్తినంగా కూడగట్టుకుని అత్యంత వేగంగా ఈత కొట్టడంతో మొసలి తన వేగాన్ని అందుకోలేక.. చివరకు తన దిశను మార్చుకుని మరోవైపునకు వెళ్లిపోయింది. దీంతో అప్పటిదాకా ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వ్యక్తి కాస్తా.. హమ్మయ్య.. అనుకుంటూ నీటి ఒడ్డుకు చేరుకున్నాడు.

Auto Accident Viral Video: కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. ఈ ఆటో డ్రైవర్‌ నిర్వాకానికి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఈ ఘటనను గట్టుపై ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీడియో చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ వ్యక్తి ఎంతో లక్కీ ఫెలో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది కదా లైవ్ మ్యూజిక్ అంటే.. ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 01:31 PM