
Breaking News: ఈడెన్ గార్డెన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ABN , First Publish Date - Mar 22 , 2025 | 11:32 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-22T16:05:47+05:30
ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్స్ దందా..
ఉప్పల్ లో మొదలైన ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా..
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో రేపు జరగబోవు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్ కి బ్లాక్ టిక్కట్ల మొదలైంది.
ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్ల ను బ్లాక్ లో అమ్ముటున్న భరద్వాజ్ అనే వ్యక్తి ని పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు.. నాలుగు టిక్కెట్లు స్వాదీనం.
నిందితుడు భరద్వాజ్ ని, నాలుగు టిక్కెట్లను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించిన ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు
-
2025-03-22T15:57:30+05:30
షారూఖ్ ఇంట్రస్టింగ్ ట్వీట్..
-
2025-03-22T15:57:29+05:30
స్టేడియంలోకి కింగ్ ఖాన్ వచ్చేశాడోచ్..
-
2025-03-22T15:43:33+05:30
ఈడెన్ గార్డెన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ..
Kolkata Weather Updates and KKR vs RCB IPL 2025: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఎక్కడ వాన వస్తుందో అని భయపడిన అభిమానుల బాధను సూర్యుడు అర్థం చేసుకున్నట్లు్న్నాడు. కోల్‌కతాలో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. వర్షం ఆనవాళ్లే లేవు. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లోనే వర్షం కురవడంతో.. ఆగిపోయింది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా.. రద్దవుతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు క్రికెట్ అభిమానులు. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
-
2025-03-22T11:32:15+05:30
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే బిగ్ ట్విస్ట్
ఇవాళ కేకేఆర్ vs ఆర్సీబీ మధ్య ఫస్ట్ మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్
మొదటి మ్యాచ్‌పై వర్షం ప్రభావం
ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం కురిసే అవకాశం
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వర్ష సూచన