Share News

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:50 PM

Kaleshwaram commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు
Kaleshwaram commission

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram Project) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గడువును మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయగా ఏప్రిల్‌ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించింది.


ALSO READ: Komatireddy: రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన కమిషన్‌.. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి

Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 07:00 PM