Share News

KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Jan 07 , 2025 | 09:51 AM

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని విమర్శించారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ఆక్షేపించారు. అమలు అయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ….మోసం అని కేటీఆర్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: కిమ్స్ ఆస్పత్రికి రానున్న సినీ నటుడు అల్లు అర్జున్..

Telangana: కారులో కూర్చుని.. నిప్పంటించుకొని..

Bhatti Vikramarka : 9న నూతన ఇంధన పాలసీ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 09:55 AM