Share News

Minister Uttam: కేసీఆర్ ప్రభుత్వ దోపిడీపై చర్యలు.. మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:24 PM

Minister Uttam Kumar Reddy: త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఒకటి రెండు హామీల అమలు ఆలస్యం అయిందని అన్నారు.

Minister Uttam: కేసీఆర్ ప్రభుత్వ దోపిడీపై చర్యలు..  మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
Minister Uttam Kumar Reddy

నల్గొండ : ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ రాబోతోందన్నారు. వీఆర్వో లు వీఆర్ఏలు రాష్ట్రంలో సుమారు 23 వేలమంది ఉన్నారని చెప్పారు. వాళ్లలో 16300 మంది రెవెన్యూశాఖలోకి రావటానికి దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ప్రెస్ అకాడమీతో చర్చించి త్వరలోనే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్‌లు ఇస్తామని ప్రకటించారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి తండాలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. అందరికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం ఇస్తుందని ప్రకటించారు. రాజకీయంగా కూడా అందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. అటవీ హక్కుల ప్రకారం మిగిలిన గిరిజనులకు భూములు ఇస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరం కలసి పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఒకటి రెండు హామీల అమలు ఆలస్యం అయిందని అన్నారు.


త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద కుటుంబాన్ని ఒక యూనిట్‌గా ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఆ కుటుంబం తప్పని సరిగా ఉపాధి హామీ పనుల్లో పాల్గొని ఉండాలని.. అంతకుమించి నిబంధనలు ఏమీ ఉండవని చెప్పారు. భూ భారతి విషయంలో చాలా పకడ్బందీగా చర్యలు ఉంటాయని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా భూ భారతి చట్టం రూపుదిద్దుకుంటుదన్నారు. భూ భారతిని గవర్నర్ కూడా ఆమోదించారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన ధరణి అమలు చేసిందని.. కనీస నిబంధనలు కూడా లేకుండా ధరణి అమలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15 లోగా భూ భారతి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై శాఖా పరమైన విచారణ జరుగుతోందని చెప్పారు. 2025 భూ భారతి చట్టంలో ల్యాండ్ అప్పీలు అధారిటీని ప్రత్యేకంగా అమలు జరుపుతున్నామని చెప్పారు. సమగ్ర సర్వేపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 59 జీఓ ద్వారా కోట్లాది రూపాయల విలువైన భూములు పిక్ షర్ట్‌లకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 59 జీఓ పేరుతో జరిగిన దోపిడీని అడ్డుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 02:28 PM