Home » Andhra Pradesh » Ananthapuram
వర్షానికి మండలంలో వరి పంటలు దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సోదరి బండారు కిన్నెర హామీ ఇచ్చారు. మండలకేంద్రంలోని నేలకొరిగిన వరిపొలాలను, తడిసిన ధాన్యాన్ని శుక్రవారం ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ప్రభు త్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ మహబూబ్బాషా హెచ్చరించారు. ఈ నెల11వ తేదీన ఆంధ్రజ్యోతిలో శివ శివా.. రూ. కోటి విలువ చేసే స్థలం కబ్జాకు యత్నం అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఊరు బాగు కోసం అందరం పాటు పడదామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఊరు బాగుండాలంటే చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలని సూచించారు.
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని(సీహెచసీ)కి వైద్యులు రాం.. రాం.. అంటున్నారు. వచ్చి విధుల్లో చేరిన రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతారు. సెలవు పెట్టరు.. రాజీనామా చేయరు. మొత్తం 8 మంది వైద్యులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీహెచసీలో వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. చేసేదిలేక జబ్బుల బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణాలకు వెళ్తున్నారు. వెరసి ప్రయాణ, వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సీహెచసీ 24 గంటలు ...
పంటలు కోత దశలో ఉన్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 1456.5 ఎకరాల్లో రూ.3.01 కోట్ల విలువైన వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, చామంతి పంటలు దెబ్బతిన్నాయి.
సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్రావు పేర్కొన్నారు.
సంతోష్ ట్రోఫీ-2024 ఫుట్బాల్ పోటీలు ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్ ఛౌబే, జేసీ శివ నారాయణశర్మ, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఈ పోటీలను ప్రారంభించారు.
ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన ఏర్పాటు చేసి తక్షణమే చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణకు కోర్టులో కేసువేసి గెలిచిన సభ్యులకు శుక్రవారం సత్కార మహాసభను నిర్వహించారు.
అహుడా చైర్మనగా నియమితులైన తర్వాత విజయవాడ నుంచి మొదటి సారిగా అనంతపురానికి వెళ్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్కు గుత్తిమండలం కరిడికొండ గ్రామశివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం కుటమి నాయకులు ఘనస్వాగతం పలికారు.