Home » Andhra Pradesh » Ananthapuram
మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా ఏన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల (మిడ్పెన్నార్) డ్యాం లోకి సోమవారం మిషన ఫింగర్లింగ్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్ఐ) పథకం ద్వారా వివిధ రకాల 12 లక్షల చేపపి ల్లలను వదిలారు.
మండల పరిధిలోని కల్లుమడి-గుమ్మేపల్లి రోడ్డుపై కల్లుమడి సమీపంలో పైపు పగిలిపోవడం తో పెద్ద రంధ్రం పడింది. ఎంపీఆర్ దక్షిణ కాలువకు అను బంధంగా ఉన్న ఐదు కాలువ నుంచి పొలాలకు నీరు వెళ్లేందుకు ఈ సిమెంట్ పైప్ లైన ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా వెళుతున్న ఈ పైపు దాదాపు ఏడాది క్రితం పగిలిపోయి రోడ్డులో పెద్ద రంధ్రం ఏర్పడింది.
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు తదితర వసతి గృహాలకు సరుకుల సరఫరా టెండర్ల ప్రక్రియ సోమవారం స్థానిక కలెక్టరేట్లో గందరగోళంగా సాగింది. గత వైసీపీ పాలనలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు టెండర్దారులు.. సమగ్రశిక్ష అతనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) సంపూర్ణను నిలదీశారు.
కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు.
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారుల వద్దకొచ్చే అర్జీదారులను గౌరవించి, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా, ముందస్తు చర్యలతో ఈఏడాది నేరాలు తగ్గాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్లో 2024కి సంబంధించిన పోలీసు వార్షిక నివేదికను సోమవారం ఎస్పీ వెల్లడించారు.
జేసీ ఫ్యామిలీని ఈ స్థా యికి తెచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఏమై నా మంచి చేయాలనే తపన తప్ప, తిట్టాలనేది తన ఉద్దేశ్యం కా దని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల ఒక రోజు ముందే చేపట్టిన సంక్షేమ పింఛన్లు పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సమగ్ర విచారణ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్ సెంటర్లలో మానవహారం నిర్వహించారు.
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో గందరగోళం నెలకొంది. అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో నిర్వ హించారు. అయితే 12ఏళ్ల వయస్సు పైబడిన, హైదరా బాద్, బెంగళూరులలో నివాసముంటూ, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎలా ఎంపిక చేస్తా రంటూ కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.