CPM: కంది కొనుగోలు వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:04 AM
కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు.
ఉరవకొండ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందన్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధరలు పతనమై, నష్టానికే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. అధికారులు చొరవ తీసుకుని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జ్ఞానమూర్తి, శీనప్ప, కౌలురైతు సంఘం నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.