Home » Andhra Pradesh » Prakasam
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనలపై అవగాహన ఉండాలని ఎంఈవో జి.వీరాంజనేయులు అన్నారు. మండలంలోని కొండమంజులూరు ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈవో ప్రారంభించారు.
చీరాల వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. చీరాలను చినముంబయి అని కూడా పిలుస్తారు. క్షీరపురి అని కూడా వాడుకలో ఉంది. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ (ఎంజీసీ మార్కెట్‌గా) ప్రసిద్ధి. పలు జిల్లాల నుంచి ఇక్కడకు వస్త్రాల కొనుగోలుకు వస్తుంటారు. సాధారణ వ్యక్తులతో పాటు రిటైల్ విక్రయాలు జరిపే వారు ఇక్కడ హోల్‌సేల్‌గా కొంటారు.
భయం..భయంగా ప్రయాణికులు బ్రిడ్జిలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. మరోపక్క బ్రిడ్జి అంచుల్లోని గోడలకు చిల్లచెట్లు కమ్మేశాయి. వానాకాలంలో బ్రిడ్జిపై నీరు చేరి రోజులతరబడి నిలిచి ఉంటుంది. ఇలాగే కొనసాగితే బ్రిడ్జి కూలే ప్రమాదముందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పిడుగురాళ్ల - వాడరేవు జాతీయ రహదారి రోడ్డు పను లు సాగుతుండడంతో వందల సంఖ్యలో భారీ వాహనాలు ఈబ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. టన్నులకొద్దీ రోడ్డు సామగ్రిని బ్రిడ్జి మీదుగా తరలిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే వివిధ వర్గాల ప్రజలు ప్రత్యేకించి యువత కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాలు నిర్వహించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా వేడుకలు జరిగాయి.
షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్‌మిశ్రా ఏకసభ్య కమిషన్ ఈనెల 5,6 తేదీల్లో జిల్లాలో పర్యటించనునుంది. ఈనేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది.
పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ (ఒంగోలు) ఇన్చార్జి రీజనల్ మేనేజర్‌గా బి.సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణరావును కర్ణాటకలో పొగాకు కొనుగోళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం మైసూరు ఇన్చార్జి ఆర్ఎంగా పంపించారు.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో అద్దంకిలో రోటరీ క్లబ్ ఆఫ్ శింగరకొండ సౌజన్యంతో శుక్రవారం జరగనున్నాయి. అద్దంకిలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి.
సంప్రదాయబద్ధంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మె ల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందేలను నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య, ఆయన సతీమణి బాలకొండమ్మ పోటీలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గ్రామీణ వ్యవసాయదారుల మనోభావాలకు అనుగుణంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో గెలుపు ఓటములను స్ఫూర్తితో తీసుకోవాలన్నారు.
అద్దంకి నియోజకవర్గంలో రెండు మార్కెట్ కమిటీలు ఉన్నా యి. అద్దంకి మార్కెట్ కమిటీ పరిధిలో అద్దంకి, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలు, సంతమాగులూరు మార్కెట్ కమిటీ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించి మార్కెట్ కమిటీ లకు రిజర్వేషన్లు ప్రకటించారు. అద్దంకి మార్కెట్ కమిటీ ఎస్సీ మహిళ, సంతమాగులూరు మార్కెట్ కమిటీ జనరల్‌కు కేటాయించారు.
కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఉగ్రకు శుభాకాంక్షలు చెప్పారు.