Home » AP Assembly Speaker
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సందర్బంగా 10 రోజుల పాటు సభలో జరిగిన వివిధ అంశాలను ఆయన వివరించారు.
ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.
శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మద నపల్లె మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తు న్నారు.
క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు.
తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది.
Andhrapradesh: గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు.