Speaker Ayyanna Patrudu : శాసన సభల పని దినాలు పెరగాలి
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:57 AM
శాసన వ్యవస్థలోని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ మౌళిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘

దీనిపై అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలి
కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వాలి
అఖిల భారత సభాపతుల మహాసభలో అయ్యన్నపాత్రుడు
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): శాసన వ్యవస్థలోని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ మౌళిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘రాజ్యాంగ విలువలను సుసంపన్నం చేయడంలో చట్టసభల పాత్ర’ అనే అంశంపై పట్నాలో జరిగిన 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. దీనిపై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ పని దినాలు తగ్గితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని, ఏడాదిలో కనీసం 75 రోజులు సమావేశాలు జరుపుకోవాలన్నారు. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగాన్ని సవరణ చేయాలన్నారు. చట్టసభలకు కొత్తగా ఎన్నికైన వారికి అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు.