Share News

పందేలు గ్రామీణ సంస్కృతిలో భాగం: రఘురామ

ABN , Publish Date - Dec 30 , 2024 | 05:07 AM

ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాలని, అవి గ్రామీణ సంస్కృతిలో భాగమని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

పందేలు గ్రామీణ సంస్కృతిలో భాగం: రఘురామ

రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాలని, అవి గ్రామీణ సంస్కృతిలో భాగమని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పందేలు లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందన్నారు. చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఆదివారం గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలకు ఆయన విచ్చేశారు. విజేతలకు బహుమలు అందజేశారు.

Updated Date - Dec 30 , 2024 | 05:07 AM