Home » Chennai News
వందే భారత్ రైలు(Vande Bharat Train)లో ఆహారం నాణ్యతా రహితంగా వుందని సీనియర్ నటుడు పార్తీబన్(Senior actor Parthiban) అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తమకు సరఫరా చేసిన ఆహారం రకాలు నాణ్యంగా లేవని, నిష్ప్రయోజనకరంగా ఉన్నాయంటూ పలువురు ప్రయాణికులు కూడా తన వద్ద మొరపెట్టుకున్నారని ఆయన తెలిపారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్లో లూప్లైన్లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొంది.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికిగాను 20 శాతం బోనస్ ఇవ్వన్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ప్రకటించారు. సవరించిన బోనస్ చట్టం 2015 ప్రకారం అత్యధిక వేతనం పొందటానికి అర్హత కలిగిన వేతన గరిష్ట పరిమితిని రూ.21,000లకు పెంచామని, ఆ మేరకు గరిష్ట వేతనాన్ని లెక్కగట్టి నెలసరి వేతన గరిష్ట వేతన పరిమితి రూ. 7వేలు ప్రకటిస్తున్నామన్నారు.
తమిళనాడులోని దిండుగల్(Dindugal) జిల్లా ఉడుమలై సమీపంలో జీపు, టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పళనికి చెందిన ఓ కుటుంబం జీపులో కినత్తుకడవులోని బంధువు అంత్యక్రియల్లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు.
లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
శివగంగ జిల్లా కారైక్కుడిలో ఆస్తి తగాదా కారణంగా తమ్ముడి చేతుల్లో కత్తిపోట్లకు గురైన అన్న గాయాలతోనే కత్తిపట్టుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళాడు. రక్తం కారుతూ పట్టా కత్తితో వస్తున్న అతడిని చూసి నర్సులు, వైద్య సిబ్బంది పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని విచారణ జరిపారు.
అసలే ఆదివారం..పైగా బీచ్‌లో మెగా ఎయిర్‌షో..! ఇంకేముంది ఉదయం 8గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్‌కు జనం పోటెత్తారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ లక్షలాదిగా తరలిరావడంతో బీచ్‌కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వచ్చాక నేరస్తులకే ఆ పార్టీలో చోటు లభిస్తోందని, అందుకే తాను ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ సీనియర్ సినీ నటుడు ఎస్వీ శేఖర్(Actor SV Shekhar) ప్రకటించారు.
ఉత్తరాది ముఠాతో కలిసి నకిలీ మొబైల్ యాప్ సంస్థ నెలకొల్పి వేలాదిమందిని మోసగించిన కేసులో చెన్నై వాషర్‌మెన్‌పేట(Chennai Washermenpet)కు చెందిన శివరామ్ జయరామన్ (30)ను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.