Home » Deputy CM Pawan Kalyan
కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణానికి చెందిన అదనపు కట్నం కోసం భార్య సౌమ్యలక్ష్మిని భర్త రామ్ లక్ష్మణ్ కుమార్, అత్తారింటి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆమె మౌన పోరాటం చేస్తుంది. తనకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ న్యాయం చేయాలిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.
నా కుమార్తె కన్నీళ్లు చూసే అలా మాట్లాడానమ్మా’.....‘నేను కూడా ఫేక్ న్యూస్ బాధితురాలినే సర్..’ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మధ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం జరిగిన చర్చ ఇది.
అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..
తమది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వంలో బాగా చేసి చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా తాము పని చేయడం లేదని చెప్పారు. ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం ..ఈ కూటమి ప్రభుత్వం ప్రజలది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని హోంమంత్రి అనిత కలిశారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుని రిమాండ్కు తరలించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. అన్ని దశల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పనులు సాఫీగా సాగేందుకు కేంద్రం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయని తెలిపారు.