Pawan Kalyan: ఏం చేశామంటే.. పవన్‌కు అనిత వివరణ
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:30 PM
అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న లైంగిక దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపాయి. హోం మంత్రి అనిత లక్ష్యంగా పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఇలా అయితే తానే హోం శాఖ బాధ్యతలు చూడాల్సి వస్తోందని అనడంతో దుమారం చెలరేగింది. ఇదే అంశాన్ని వైసీపీ ట్రోల్ చేయగా.. అదేం లేదని, హోం మంత్రి, పోలీసుల పనితీరు గురించి డిప్యూటీ సీఎం మాట్లాడారని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
పవన్‌తో అనిత భేటీ..
అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యానని రాసుకొచ్చారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, హోం శాఖ తీసుకున్న చర్యలను వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న ఘటనలపై ప్రత్యేక దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ కోరారని తెలిపారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అనిత స్పష్టం చేశారు.
మెంటల్లీ..
సోషల్ మీడియా పోస్ట్‌లపై హోం మంత్రి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను మానసికంగా బలవంతురాలని అని, అందుకే ఆ పోస్ట్‌లు చూసి ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు. మరొకరు అయితే సూసైడ్ చేసుకునే వారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్న వారిని ఇలాగే వదిలేయలా. నా పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అందులో జనసేనకు వ్యతిరేకంగా రాశారు. మహిళలపై కామెంట్ చేసిన వారికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొని రావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావిస్తున్నారు అని’ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. తల్లి, చెల్లిపై ఎవరైనా మాట్లాడితే కోపం వస్తోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే
Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్
Read Latest AP News And Telugu New