Home » Goldsilver Price
రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం విలువ అమాంతం పెరిగిపోతోంది. డాలర్ విలువ కొంతమేర తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పుంజుంకుంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,344 డాలర్ల వద్ద ఉంది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉంది.
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్(gold) ధరలు ఈరోజు(june 23rd, 2024) మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 66,350కు చేరుకుంది.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరగగా, బంగారం ధర రూ. 220 పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ బంగారం(gold) ధరల్లో మాత్రం మార్పు లేకుండా అదే స్థాయి వద్ద ఉన్నాయి. కానీ నిన్న పెరిగిన వెండి(silver) ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు గోల్డ్, సిల్వర్ రేట్లు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్న వేళ దేశంలో బంగారం(gold) ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. అదే సమయంలో వెండి(silver) ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 350 తగ్గగా, కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగింది.
దేశవ్యాప్తంగా నేడు (జూన్ 17న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు కొంత ఉపశమనం కల్పించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 10 తగ్గి రూ. 66,640కి చేరింది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఎదురైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లలో రికవరీ కనిపిస్తోంది. రెండు రోజుల క్షీణత తర్వాత, మార్కెట్లో బలమైన పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరిగి రూ. 66,500కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో నేడు (జూన్ 14న) దేశంలో మళ్లీ బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ.72,150కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,200 వద్ద ముగిసింది.