Home » Haryana
డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.
హరియాణాలో అక్టోబరు-నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం(Road Accident) జరగడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది ఈ విషాద ఘటన.
ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని బామ్మర్లో బుధవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
హరియాణాలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తీసుకుంటోంది. కాంగ్రె్‌సతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.