Home » Jagan
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కాలగర్భంలో కలిసిపోనుంది. ఎలాంటి ఉపయోగమూ లేని ఈ వ్యవస్థను రద్దుచేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బేవజరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్‌కు ఇదే విషయాన్ని చెప్పారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఢిల్లీలో రాష్ట్రం పరువు పోతోంది. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో ఆయా శాఖలకు చెందిన అప్పటి రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త అధికారులకు ఇబ్బందిగా మారింది.
అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.