Jagan: అది హిందూ ధర్మంపై దాడే
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:25 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కూటమి ప్రభుత్వంపై కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసినట్లు ఆరోపించారు. హిందూ ధర్మంపై, ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రభుత్వ అహంకారంతో దాడి చేశారని ఆయన విమర్శించారు

‘కాశినాయన క్షేత్రం’ కూల్చివేతలపై జగన్
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసిన కూటమి ప్రభుత్వం... వాతలు పెట్టి వెన్నపూసిన మాదిరి వ్యవహరిస్తోంది’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన కూటమి ప్రభుత్వంపై ఘాటైన పదజాలంతో విమర్శ చేశారు. ‘కాశినాయన క్షేత్రాన్ని అటవీ శాఖ నుంచి మినహాయింపును ఇచ్చి ఆలయానికి రిజర్వ్ చేయాలంటూ సీఎం హోదాలో నేను రాసినలేఖతోనే కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఆరు నెలల్లో కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూస్తోంది. హిందూ ధర్మంపైనా, ఆధ్యాత్మిక క్షేత్రాలపైనా అధికార అహంకారంతో దాడి చేశారు’ అని జగన్ విమర్శించారు.