Home » Lok Sabha Results
ఉత్తరప్రదేశ్(UP) ఎన్ని్కల్లో గణనీయమైన సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటులో బీఎస్పీ గెలవలేకపోయింది.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రశంసించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ఒకేసారి రెండు భారీ రికార్డులను సృష్టించింది. ఇక్కడి విజేతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.75 లక్షల ఆధిక్యం వచ్చింది. పోలైన ఓట్లలో ‘నోటా’ రెండో స్థానం పొందడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వానీకి సమీప ప్రత్యర్థికన్నా 11,75,092 ఓట్ల మెజార్టీ లభించింది.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత డిమాండు చేశారు. అ
గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించి అన్నింటా గెలిచింది. అసోంలో 14 సీట్లకు గాను 2019లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది.