Home » Maha Shivratri
Maha Shivratri 2024: మహాశివరాత్రి రోజున భక్తులు పరమేశ్వరుడిని(Lord Shiva) ఆరాధిస్తారు. తద్వారా శివుడి ఆశీస్సులను పొందుతారు. భక్తిప్రపత్తులతో ఈశ్వరుడిని పూజిస్తే.. కష్టాలు తొలగిపోతాయని, కోరికలను నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. అయితే, పురాణాల ప్రకారం.. ఆ మహాదేవుడికి కొన్ని రాశిఫలాలు(Zodiac Signs) అంటేచాలా ఇష్టమట. ఆ రాశుల వారిపై శివుడి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటుందట.
Mahashivratri 2024: భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తిప్రపత్తులతో, పరమనిష్ఠా గరిష్ఠలతో మహాశివరాత్రిని(Mahashivratri) జరుపుతారు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడిని(Lord Shiva) స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనసుతో, భక్తితో పూజిస్తారు(Devotees). మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని పూజించే భక్తులపై శివుడు కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం.
Dehradun News: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.
శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజస్థాన్లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుదాఘాతంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు.
Viral Video: మహాశివరాత్రి వేళ జగిత్యాల(Jagtial) జిల్లా ధర్మపురి(Dharmapuri)లో వింత ఘటన చోటు చేసుకుంది. బయటి నుంచి ఓ ఇంట్లోని పూజ గదిలోకి(House Temple) వచ్చిన పిచ్చుక(Sparrow).. కాసేపు ధ్యానం చేసింది. దేవుడి ఎదుట కూర్చుని ధ్యానంలో నిమగ్నమైంది. అది చూసి భక్తులు పరవశించిపోయారు. హర హర మహాదేవ అంటూ నినాదాలిచ్చారు.
Andhrapradesh: నగరంలోని ఆర్కే బీచ్లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో మహా కుంబాభిషేకం చేపట్టారు. కుంబాభిషేకాన్ని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.
Telangana: తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వందేళ్ల చరిత్ర గల ఏడుపాయల వనదుర్గామాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర ప్రసిద్ధి చెందింది
Andhrapradesh: మహాశివరాత్రి సందర్భంగా పలు శైవక్షేత్రాలు శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు.
Telangana: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు... మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది.
Telangana: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ఆలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు.