Mahashivrathri 2025 Fasting Rules: మహా శివరాత్రి నాడు ఉండే 3 రకాల ఉపవాసాల గురించి తెలుసా
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:13 AM
శివరాత్రి నాడు ఆచరించాల్సిన 3 రకాల ఉపవాసాలు, పాటించాల్సిన ఆహార నియమాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

మహాశివరాత్రి.. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. శివరాత్రి ఉపవాసనంతో సకల పాపాలు హరించుకుపోయిన శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే, శివరాత్రి ఉపవాసం ఉండదలిచిన వారు కఠిన ఆహార నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అప్పుడే, ఉపవాస వ్రత ఫలితం, శివానుగ్రహం సిద్ధిస్తుంది. ఉపవాస దీక్ష సందర్భంగా పాటించాల్సిన పద్ధతులను పెద్దలు సవివరంగా తెలిపారు (Shivrathri Fasting Dos and Don'ts).
ఉపవాస దీక్షలో మూడు విధానాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇందులో మొదటిది నిర్జల ఉపవాసం. ఈ ఉపవాసం ఉన్న వారు ఆహార, నీరు తాగకుండా కఠిన దీక్షను పాటిస్తారు. ఇక రెండోది ఫలాహార ఉపవాసం. ఈ దీక్ష చేపట్టిన వారికి పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినే వెసులుబాటు ఉంటుంది. ఇక సమాప్త ఉపవాసం ఉన్న వారు పండ్లు, పాల ఉత్పత్తులతో పాటు బియ్యం, గోధుమలు, ఇతర గింజలు లేని సాత్వికాహారం తీసుకుంటారు.
Maha Kumbh culmination today: కుంభమేళా చివరి రోజు.. అమృత స్నానం కోసం పోటెత్తుతున్న భక్తులు
శివపూజ సందర్భంగా గరళ కంఠుడికి నైవేద్యంగా రా రైస్, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలను సమర్పిస్తారు. కొందరు శివరాత్రికి ఒక రోజు ముందు నుంచే దీక్ష ప్రారంభిస్తారు. ముందు రోజున అంటే త్రయోదశి నాడు కేవలం సాత్వికాహారం మాత్రమే తిని శరీరాన్ని మనసును శుద్ధి చేసుకుంటారు.
ఉపవాస దీక్ష సందర్భంగా తినదగిన ఆహారం
ఫలాహార ఉపవాసం ఉండదలిచిన వారు కొన్ని ఆహారాలను తినొచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఆపిల్స్, అరటి, దానిమ్మ, బాదం పప్పులు, రెయిసిన్స్ వంటివి తినవచ్చు. వీటితో పాటు పాలు, యోగర్ట్, బటర్ మిల్క్ వంటి ఆహారాలన్నీ ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగినవిగా భావిస్తారు. సాబుదానాతో చేసిన కిచిడీ లేదా ఇతర ఆహారాలను కూడా తినవచ్చు. సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడాలని కూడా అనుభవజ్ఞులు చెబుతారు. సైంధవ లవనంలో సాత్విక గుణం ఉండటమే ఇందుకు కారణం.
ఉపవాస దీక్షలో ఉన్న వారు అస్సలు తినకూడదని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అన్నం, గోధుమలు, కంది, పెసర లాంటి పప్పుదినుసులు బఠాణీలు వంటివాటికి దూరంగా ఉండాలి. వీటికి తామసిక ఆహారం అని పేరు. ఆధ్యాత్మిక క్రతువుల్లో వీటికి స్థానం లేదు. ఈ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. మనసును విచలితం చేసే కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్, టీ కాఫీలకు దూరంగా ఉంటేనే నేడు భగవంతుడిపై నిశ్చల ఏకాగ్రత కుదురుతుంది. రకరకాల అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఉండే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఉపవాసం సందర్భంగా దూరంగా ఉండాలి.
Read Latest and Spiritual News