Share News

Kishan Reddy: భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి..

ABN , Publish Date - Feb 27 , 2025 | 08:59 AM

సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి అఖండ జ్యోతియాత్ర దోహదపడుతుందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. బర్కత్‌పురలోని యాదాద్రి భవన్‌ వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి 31వ అఖండ జ్యోతియాత్రను ప్రారంభించారు.

Kishan Reddy: భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి..

- అఖండ జ్యోతియాత్రను ప్రారంభించిన కిషన్‌రెడ్డి

- మార్చి 1 యాదగిరిగుట్టలో యాత్ర ముగింపు

హైదరాబాద్: సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి అఖండ జ్యోతియాత్ర దోహదపడుతుందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. బర్కత్‌పురలోని యాదాద్రి భవన్‌ వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి 31వ అఖండ జ్యోతియాత్రను.. అఖండ జ్యోతియాత్ర చైర్మన్‌ సద్ది వెంకట్‌రెడ్డి, యాదాద్రి శాశ్వత ఫౌండర్‌ బి.నర్సింహమూర్తి, అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌రావు, బీజేపీ సెంట్రల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, కార్పొరేటర్‌ కన్నె ఉమాదేవి తదితరులతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం యాత్రను ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఒడిశా టు హైదరాబాద్‌.. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా


ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 31 ఏళ్లుగా అఖండ జ్యోతియాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తారని అన్నారు. అఖండ జ్యోతియాత్ర కమిటీ చైర్మన్‌ ఎస్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ యాత్ర నగరంలోని ముషీరాబాద్‌, ఉప్పల్‌, మేడిపల్లి, నారాపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి మీదుగా మార్చి 1న యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు.


అఖండజ్యోతి యాదాద్రీ ఆలయ అధికారులకు అప్పగిస్తామని ఆ తర్వాత వైష్ణవ సమాఖ్య కార్యాలయం వద్ద వేదఘోష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అఖండజ్యోతి యాత్ర కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎంఎన్‌ ధరణి. గౌరవ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి ఎస్‌పి. ఉపేందర్‌రావు, సహాయ కార్యదర్శి బొమ్మల సుదీ్‌షకుమార్‌, బీజేపీ నేతలు కన్నె రమేష్ యాదవ్‌, ఎక్కాల నందు. నందకిషోర్‌యాదవ్‌, చిట్టి శ్రీధర్‌, సుబా్‌షపటేల్‌, క్షీరసాగర్‌, అరవింద్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 08:59 AM