అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

ABN, Publish Date - Feb 26 , 2025 | 03:52 PM

Shivalingas: మహాశివరాత్రి పర్వదినాన ఓ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నాడు. దాదాపు 109 శివలింగాలను చాక్‌పీసులతో తయారు చేశాడు. ఈ శివలింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి (Mahashivaratri) సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు వినూత్న రీతిలో తన భక్తిని చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్ 109 శివలింగాలను చాక్‌పీసులతో తయారు చేశాడు. దాదాపు పది గంటల పాటు శ్రమించి తయారు చేసిన చాక్‌‌పీస్ శివలింగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సెంటీమీటర్ ఎత్తు, సెంటీమీటర్ వెడల్పు ఉన్న శివలింగాలను గుండుపిన్నుతో తయారు చేసినట్లు సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్ తెలిపారు. ఈ లింగాలు తయారు చేసేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని.. పెన్సిల్ గ్రాఫైట్‌పై నాలుగు మిల్లిమీటర్ల ఎత్తున్న శివలింగాన్ని కూడా తయారు చేశానన్నారు. అలాగే క్యారెట్, బంగాళాదుంపతో కూడా వివిధ ఎత్తుల్లో శివలింగాలను చేసినట్లు సూక్ష్మ కళాకారుడు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Vamsi in police custody: రెండో రోజు వంశీ విచారణ.. కీలక అంశాలపై ప్రశ్నలు

Shamshabad Airport flight delays: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి ప్రయాణికుల ఆందోళన

Read Latest Telangana News And Telugu News

Updated at - Feb 26 , 2025 | 03:53 PM




News Hub