Share News

Maha Shivarathri: కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

ABN , Publish Date - Feb 26 , 2025 | 10:48 AM

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..

Maha Shivarathri: కనులపండువగా  శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..
Maha Shivarathri sambaralu

పల్నాడు జిల్లా: మహాశివరాత్రి (Maha Shivarathri) సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ (Kotappakonda) శ్రీ త్రికోటేశ్వరస్వామి (Sri Trikoteswara Swamy) తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామికి దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పోలీసు శాఖ గట్టి బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడపుతోంది.

ఈ వార్త కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..


బుధవారం తెల్లవారుజాము 2 గంటలకు బిందె తీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. 19 భారీ విద్యుత్‌ ప్రభలు తిరునాళ్లలో కాంతులీననున్నాయి. కోటప్పకొండ దిగువన, దేవస్థాన ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిపూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.


కోటప్ప కొండపై డ్రోన్ ప్రమాదం..

పల్నాడు జిల్లా, కోటప్ప కొండపై డ్రోన్ ప్రమాదం జరిగింది. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే సాంకేతిక సమస్యతో విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద స్థలంలో జనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రోన్ విద్యుత్ తీగెలపై పడిన సమయంలో జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు సంఘటన స్థలంలోనే ఉన్నారు. నాణ్యత లేని డ్రోన్లు, అనుభవం లేని వ్యక్తులతో డ్రోన్లు ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగింది. కోటప్పకొండలో ఏర్పట్ల విషయంలో అధికారులు అలసత్వం వహించారని విమర్శ వస్తోంది. డ్రోన్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి పోలీసుల షాక్..

శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు

తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 26 , 2025 | 10:48 AM