Home » Mancherial district
అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమ వారం కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించారు. పట్ట ణంలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ప్రజలకు అందు బాటులో ఉండి అంకితభావంతో విధులు నిర్వర్తిం చాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేశారు. ప్రాణహిత సరిహద్దు గ్రామాలు, కేసుల నమోదు, మావోయిస్టుల ప్రాబల్యం, తదితర అంశాలను తెలుసుకున్నారు.
సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందించారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనంతోపాటు క్వింటాలు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు.
రైతులు పట్టు పురుగులు సాగు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుందని, అధిక లాభాలు గడించవచ్చని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ లత, సెంట్రల్ సిల్క్ బోర్డు సీనియర్ సైంటిస్టు వినోద్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టం 2019లోని టీఎస్-బీ పాస్‌కు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా లేఅవుట్ పర్మిషన్, భవన నిర్మాణా లకు అనుమతులు, తదితర ప్రక్రియను పటిష్టం చేసేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలను సైతం నియమించింది.
స్ధానిక సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గ్రామాల ప్రజలు అనారోగ్యం, జ్వరాలతో బాధపడు తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
సమస్యలను పరి ష్కరించడానికే గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇందారంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉం టున్నాయని సమస్యను పరిష్కరించాలని ఎమ్మె ల్యేకు తెలిపారు.
చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు కోర్టు జడ్జి రవి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూ రుకు సంబంధించి పది రోజుల్లో విధివిధానాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న గూడు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.