అటవీ శాఖలో సిబ్బంది కొరత
ABN , Publish Date - Sep 30 , 2024 | 10:28 PM
అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 30: అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండడంతో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.
జిల్లాలో అటవీ విస్తీర్ణం
జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, జన్నారం అటవీ డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మంచిర్యాలలో 55,005 హెక్టార్ల అడవి విస్తీర్ణం ఉండగా, బెల్లంపల్లిలో 40,658 హెక్టార్లు, చెన్నూరు డివిజన్ పరిధిలో 53,723 హెక్టార్లు, జన్నారం డివిజన్ పరిధిలో 27,312 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. వీటి పరిధిలో పనిచేస్తున్న అధికా రులు అడవులను, వన్యప్రాణులను రక్షిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తారు. దీంతోపాటు అటవీ భూములను పరిరక్షించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. వీటిని రక్షించే సందర్భంలో సిబ్బందిపై దాడులు సైతం చోటుచేసుకుంటున్నాయి.
అధికారుల కొరతతో అటవీ సంరక్షణకు ఇబ్బందులు
జిల్లాలో అటవీ శాఖలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ఫారెస్టు రేంజ్ అధికారుల పోస్టులు 16 ఉండగా 11 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు బీట్ అధికారులు (ఎఫ్‌బీవో) పోస్టులు 242కు గాను కేవలం 137 మంది విధులు నిర్వహిస్తుండగా 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటవీ సెక్షన్ అధికారులు (ఎఫ్‌ఎస్‌వో) పోస్టులు 46 మం ది విధులు నిర్వహిస్తుండగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటవీ బీట్ అధికారుల భర్తీని 2019లో చేపట్టారు. ఇం దులో చాలా మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. అంతేకాకుండా యేటా పదవీ విరమణతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 5 ఏండ్లుగా ప్రభు త్వం అటవీ శాఖలో పోస్టులను భర్తీ చేయడం లేదు. అలా గే డీఎఫ్‌వో సైతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జన్నారం, చెన్నూరు డివిజన్‌లకు ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్లు లేకపోవడంతో డీఎఫ్‌వోనే ఇన్‌చార్జీగా వ్యవహరి స్తున్నారు. కొన్ని రోజులుగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా డీఎఫ్‌వోనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఏకంగా డీఎఫ్‌వోకు మూడు డివిజన్‌లకు ఇన్‌చార్జీగా వ్యవహరించడంతో పనిభారం పెరుగుతోంది.
--అడవులపై కొరవడుతున్న పర్యవేక్షణ
అటవీ శాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండడంతో అడవులపై పర్యవేక్షణ కొరవడుతుందనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమార్కులు కలప స్మగ్లింగ్, కొందరు అటవీ భూములను ఆక్రమించడం వం టివి చోటు చేసుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారులు సర్వే చేపడుతున్న సమయంలో అటవీ భూమి అన్యా క్రాంతానికి గురవుతుండడంతో తరుచూ రైతులకు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్ష ణలకు దారి తీస్తోంది. దీంతో పాటు వేటగాళ్లు వన్య ప్రాణులను హతమారుస్తున్నారు. కొందరు విద్యుత్ వైర్లు, ఉచ్చుల సహాయంతో అటవీ జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి అటవీ శాఖలోని పోస్టులను భర్తీ చేసి అడవులను, వన్యప్రాణులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.