Home » Mancherial district
పట్టణంలోని కూరగాయల మార్కెట్ భవనానికి గడ్డం వెంకటస్వామి(కాకా) పేరు పెట్టడం సిగ్గు చేటని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయకార్యదర్శి పసులేటి వెంకటేష్‌లు పేర్కొన్నారు. మార్కెట్ భవనానికి వెంకటస్వామి పేరును రద్దు చేయాలని సోమవారం మార్కెట్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు.
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పేరుతో రైస్మిల్లర్లపై అధికారుల వేధింపులు తగవని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ కింద క్వింటాల్‌కు 67 కిలోల సన్న బియ్యం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. నూకలతో కలిపి లెక్కగట్టినా 55 కిలోల కంటే దాటదని తెలిపారు.
ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, వాహనదారుడు ట్రాఫిక్ నిబంధ నలు పాటించాలని సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రైల్వే బ్రిడ్జితోపాటు ఫ్లై ఓవర్లలో స్పీడ్ బ్రేకర్లు వేసే విషయం పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతీ వాహనదా రుడు రోడ్డు భద్రత గురించి తెలుసుకోవాలన్నారు.
పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టడంతో వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశావహులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు వేర్వేరుగా జరగనున్నాయి.
గుడిరేవులోని పద్మల్‌పూరీకాకో ఆలయానికి తరలివస్తున్నారు. దీపావళి పండుగతో దండారీ ఉత్సవాలు ముగుస్తుండటంతో ఆదివారం పెద్దఎత్తున గిరిజనులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. మందుగా గుస్సాడి వేషధారణలతో డప్పుచప్పులతో నృత్యాల మధ్య గోదావరి తారానికి చేరుకుని స్నానం ఆచరించి అమ్మవారిని గంగాజలంతో అభిషేకం చేసి దండారీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేటాయింపుల్లో రోడ్డు, రవాణా, విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మన్నెగూడం క్రాస్‌రోడ్ నుంచి కోనంపేట మీదుగా కుశ్నపల్లి వరకు బీటీ రోడ్డు, మన్నెగూడం ప్రాథమిక పాఠశాల ప్రహారి నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు.
నస్పూర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శార్వాణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థులకు గురువు డాక్టర్ భార్గవిప్రేమ్ ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అడవుల సంరక్ష ణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతా రామ్ అన్నారు. తాని మడుగు బీట్ పరిధిలో జరుగుతున్న టేకు చెట్ల నరికివేతను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్‌సింగ్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్ రమాదేవి కలిసి ఆదివారం పరిశీలించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అర్హత గల ఆర్ట్, క్రాఫ్ట్ అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రిక్రూట్మెంట్ జరగగా అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా నియామకాలు జరగలేదు. డీఎస్సీ నియామకాల్లో పోస్టులు కేటాయించకపోవడంతో ఆ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు.
ఎస్సీ వర్గీకరణ చేస్తే నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడి ముసలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.