Home » National News
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
దేశంలోని పలు ప్రాంతాలను చలి వణికిస్తుంది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.
షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.
ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. గాలి నాణ్యత వరుసగా ఐదో రోజు కూడా తీవ్రమైన విభాగంలోనే చేరింది. అయితే ఈరోజు గాలి నాణ్యత ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పశ్చిమాఫ్రికా ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొడుకును క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు ఓ తండ్రి.
జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
ఆందోళనకారులు ఇద్దరు మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది. జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది.