Share News

Jairam Ramesh: ఇది ట్రైలరే.. తగ్గేదే లేదు: కాంగ్రెస్

ABN , Publish Date - Dec 20 , 2024 | 08:46 PM

ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం తీర్మానం నోటీసు అనాలోచిత చర్య అంటూ గత గురువారంనాడు విపక్షాల నోటీసును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చిన నేపథ్యంలో జైరాం రమేష్ శుక్రవారంనాడు స్పందించారు.

Jairam Ramesh: ఇది ట్రైలరే.. తగ్గేదే లేదు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar)పై విపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు కేవలం ట్రైలర్ (Trailer) మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో విపక్ష పార్టీలు తిరిగి అభిశంసన నోటీసు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం తీర్మానం నోటీసు అనాలోచిత చర్య అంటూ గత గురువారంనాడు విపక్షాల నోటీసును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చిన నేపథ్యంలో జైరాం రమేష్ శుక్రవారంనాడు స్పందించారు.

Yogi Adityanath: ఔరంగజేబు వారసులపై యోగి సంచలన వ్యాఖ్యలు


'సభాధ్యక్షుడిపై మేము ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును ఆమోదించలేదు. అవిశ్వాస తీర్మానం ఎన్నిసార్లు ప్రవేశపెట్టాలనే దానిపై రాజ్యాంగంలో ఎలాంటి పరిమితి లేదు. 2025 జనవరి 30న బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. అప్పుడే మళ్లీ పరిశీలిస్తాం" అని జైరాం రమేష్ చెప్పారు. మరోసారి నోటీసు ఇస్తారా అని అడిగినప్పుడు "అవును" అని సమాధానమిచ్చారు.


రాజ్యసభ చైర్మన్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తూ విపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని, అడుగడుగునా విపక్షాలకు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ 60 మంది విపక్ష ఎంపీలు ఆయనపై డిసెంబర్ 10న అభిశంసన నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని 67(బి) నిబంధన కింద ఈ నోటీసు ఇచ్చారు. తనపై అభిశంసన నోటీసు కావడంతో తాను నిర్ణయం తీసుకోలేని ధన్‌ఖడ్ సభాధ్యక్ష స్థానంలో కూర్చోలేదు. డిప్యూటీ చైర్మన్ సభాధ్యక్ష స్థానంలో కూర్చుని విపక్షాల నోటీసును తోసిపుచ్చినట్టు ప్రకటించారు. ఇది అనాలోచిత చర్య అని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి ప్రతిష్ఠను తగ్గించే వీలున్నందున నోటీసును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, డిసెంబర్ 20తో సమావేశాలు ముగియాల్సి ఉన్నందున నోటీసును తోసిపుచ్చుతున్నామంటూ ఆయన రూలింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు

Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 20 , 2024 | 08:46 PM