Yogi Adityanath: ఔరంగజేబు వారసులపై యోగి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:57 PM
ప్రపంచ నాగరికతను పరిరక్షించాలంటే సనాతన ధర్మం, విలువలను కాపాడాలని యోగి హితవు పలికారు. పురాతనకాలం రుషులు వసుధైక కుటుంబానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
అయోధ్య: మతపరమైన సహనం, మైనారిటీలపై దాడులు వంటి అంశాలపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. మెఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం కోల్‌కతాలో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నట్టు తనకు తెలిసిందని అన్నారు. హిందూయిజానికి, హిందూ ఆరాధనా స్థలాలకు ఔరంగజేబు హాని చేయకుండా ఉంటే ఆయన వారసులకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని అయోధ్యలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
Mohan Bhagwat: మందిర్-మసీదు వివాదాలు పెరగడం ఆందోళనకరం: ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచ నాగరికతను పరిరక్షించాలంటే సనాతన ధర్మం, విలువలను కాపాడాలని యోగి హితవు పలికారు. పురాతనకాలం రుషులు వసుధైక కుటుంబానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. సనాతన ధర్మం ఇతర మతాలు, కమ్యూనిటీల పట్ల కారుణ్యాన్ని చాటుచెబుతుందన్నారు. అలాంటి గౌరవం పలు ప్రపంచ దేశాల్లోని హిందువులకు దక్కడపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై అకృత్యాలు జరుగుతున్నాయని, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది నిదర్శనమని అన్నారు.
కాశీ, అయోధ్య, సంభాల్, భోజ్‌పూర్‌లో హిందూ ఆలయాలపై తరచు దాడులు, అపవిత్రం చేసిన ఘటనలు చరిత్రలో ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం పరిఢవిల్లాలంటే సనాతన ధర్మం ప్రాధాన్యతను నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం
Read More National News and Latest Telugu News