Home » Raptadu
మండలంలోని బండమీదపల్లి నుం చి పాలబావికి వెళ్లే మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు మొ త్తం రాళ్లు తేలి గుంతలమయమైంది. దీంతో బండమీదపల్లి నుంచి పాల బావి కి వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సావిత్రమ్మ, రామాంజనేయులురెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యేగా ఉన్న లేకున్నా పరి టాల రవీంద్ర భార్యగా ఈ ప్రాంతానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఓ వరంలాంటి దన్నారు.
మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు.
వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎ మ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు.
అధికారంలో ఉండగా రైతుల గురించి ఏ మార తం పట్టించుకోకుండా, విద్యుతరంగాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ అఽధినేత వైఎస్ జగన ఇప్పుడు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎమ్మె ల్యే పరిటాలసునీత విమర్శించారు. మండలం లోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేక రుల సమావేశంలో మాట్లాడారు.
అకాల వర్షాలు అన్నదాతకు నష్టం తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో ఎడతెరపిలేకుండా కురుస్తు న్న వ ర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలతో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటి ల్లింది.
విద్యార్థులు సెల్ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నా రు. కేక్‌కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు.