MLA : అభివృద్ధి ఎవరు చేశారో నిలదీయండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:03 AM
మండలంలో ఎవరు అభివృద్ధి పనులు చేశారు? నీళ్లు ఎవరు తెచ్చారు?’ అని వైసీ నాయకులను నిలదీసి అడగండని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 1.20కోటితో నిర్మంచిన తలుపూరు తారురోడ్డు, రూ.15లక్షలుతో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు.

- అభివృద్ధి పనుల ప్రాంభోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
ఆత్మకూరు మార్చి27(ఆంధ్రజ్యోతి): మండలంలో ఎవరు అభివృద్ధి పనులు చేశారు? నీళ్లు ఎవరు తెచ్చారు?’ అని వైసీ నాయకులను నిలదీసి అడగండని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 1.20కోటితో నిర్మంచిన తలుపూరు తారురోడ్డు, రూ.15లక్షలుతో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎ మ్మెల్యే మాట్టాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి తారురోడ్డు వేసి వచ్చానన్నారు. పరిటాల రవీంద్ర ట్రస్టు ద్వారా రూ. లక్షతోప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఇటీవల వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అలాంటి వారిని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలో ఉండగా ఎలాంటి అభివృద్ధి చేయలేనివారు ఇప్పుడు ఇలామాట్లడటం ఏమిటని నిలదీయాలన్నారు. గ్రామాల్లో కక్షలు సృష్టించేవారుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో, పుకార్లు నమ్మి ఆందోళనచెందవద్దన్నారు. అనంతరం పంపనూరులోని ఆలయ ముఖద్వారాన్ని, ఆలయంలో కూలర్లు, చలవేంద్రాన్ని ప్రారంభించారు. టీడీపీ మండల ఇనచార్జి బాలాజి, కన్వీనర్ శ్రీనివాసులు, నాయకులు నెట్టెం వెంకటేశులు, నారాయణస్వామి, కృష్ణమోహనచౌదరి, శశాంక చౌదరి, అనిల్ చౌదరి, మనోరంజన, శ్రీనివాస రెడ్డి, కందుళ ఓబుళపతి, రామదాసు అక్కులన్న, సత్య రంగయ్య పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....