MLA: చంద్రబాబు సీఎం అయ్యాకే ప్రజలకు భరోసా
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:52 PM
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఇంటి వద్దకు పింఛన వస్తోందా... లేదా.. అని ఆరాతీశారు.

- త్వరలోనే అర్హులందరికి పింఛన్లు : ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఇంటి వద్దకు పింఛన వస్తోందా... లేదా.. అని ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో గత ఐదేళ్లు ప్రజలు అభద్రతా భావంతో ఉండేవారని, ఇప్పుడే ప్రజలకు నమ్మకం, భరోసా వచ్చిందన్నారు. ప్రతినెల ఒకో తేదీన తలుపు తట్టి పింఛన ఇస్తున్న ప్రభుత్వం ఇదే అన్నా రు. గత వైసీపీ హయాంలో అర్హులైన చాలా మంది పింఛన్లు తొలగించా రన్నారు. ఎలాంటి వైకల్యం లేకుండా చాలా మంది పింఛన్లు పొంది ఇప్పటికీ తీసుకుంటున్నారన్నారు. అలాంటి పింఛన్లు తొలగిస్తామన్నారు. అలాగే అర్హులైన అందరికీ పింఛన్లు త్వరలో వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్, ఎంపీటీసీ శ్రీనివాసులు, ఎంఈఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు రామోజీ, సుబ్రహ్మణ్యం, రమణ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....