MLA : డీలర్లకు సక్రమంగా బియ్యం సరఫరా చేయాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:01 AM
బఫర్‌తో సంబంధం లేకుండా డీలర్లకు రేషన బియ్యం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయం త్రం నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యసాయి, అనంతపు రం జిల్లాలకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు.

- బఫర్‌తో సంబంధం లేకుండా అందించాలి
- అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం
అనంతపురం రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): బఫర్‌తో సంబంధం లేకుండా డీలర్లకు రేషన బియ్యం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయం త్రం నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యసాయి, అనంతపు రం జిల్లాలకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో బఫర్ పెండింగ్‌లో ఉంచడం వల్ల ఆ ప్రభా వం తమపై పడుతోందని ప్రస్తుతం ఉన్న డీలర్లు ఇటీవల ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతినెలా బఫర్ స్టాకు పేరుతో రేషన బియ్యం బస్తా మీద నాలుగు నుంచి ఐదు కేజీలకు పైగా తక్కువగా వస్తున్నాయని తక్కువగా సరఫరా చేస్తున్నారని ఇలాగైతే ప్రజలకు ఎలా పంపిణీ చేసేదని వాపోయారు. ఇదే అంశాలను అధికారులతో ఆమె చర్చించారు. బియ్యం తక్కువ ఇస్తే డీలర్లు కూడా లబ్దిదారుకులు సరిగా అందించలేరని అంతి మంగా అది ప్రజలపై ప్రభావం పడుతుంద న్నారు. స్టాక్ పాయింట్లలో తూకాలు కచ్చితంగా ఉండాలని, ఎవరైనా మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండీయూ వాహనదారులకు ప్రతినెల డబ్బులు చెల్లిస్తున్న ప్పటికి ఇంటింటికి రేషన సరఫరా చేయకపోవడం వంటి అంశాలపైనా చర్చించారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉండటంతో తాము ఉన్నతాధికారులకు, పౌరసరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో కొత్త రేష్‌కార్డులు వస్తాయని, అర్హులైనా అందరి కీ రేషనకార్డులు అందేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు ఈకేవైసీ చేయిం చుకోని రేషనకార్డుదారులు ఖచ్చితంగా చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఉమ్మడిజిల్లా డీఎస్‌ఓలు, డీఎంలు, ఆరు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఎస్‌డీటీలు, రేషన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....