Share News

DEVOTIONAL: ఘనంగా నరసింహస్వామి ఊరేగింపు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:44 PM

మండలంలోని మేడాపురం గ్రామంలో శనివారం ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ప్రతి ఏటా ఉగాది పండు గను పురస్కరించుకుని ఇక్కడ నా లుగురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

DEVOTIONAL: ఘనంగా నరసింహస్వామి ఊరేగింపు
A scene of Lord Narasimha being taken in procession

చెన్నేకొత్తపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మేడాపురం గ్రామంలో శనివారం ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ప్రతి ఏటా ఉగాది పండు గను పురస్కరించుకుని ఇక్కడ నా లుగురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివారం మూడో రోజు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజామున నుంచి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా చుట్టు గ్రామల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా ఆలయం చు ట్టూ పలహారపు బండ్లను తిప్పారు. సాయంత్రం స్వామివారి పంజుసేవకు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ఒంటికొండలో అక్కదేవతల ఉత్సవాలు: ఉగాది పండుగను పురస్కరించుకుని మండలపరిధి లోని ఒంటికొండ గ్రామంలో అక్కదేవతల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొడప గానిపల్లి సమీపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ఆమిదాలకుంట, ప్రసన్నాయపేట, ఓబుళంపల్లి మీదుగా ఆదివారం సాగింది. ఆలయం చుట్టూ పలహారపు బండ్లు తిప్పారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు బారీగా తరలివచ్చి అక్కదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సోమవారం పరుష, కుంకాల కార్యక్రమంతో ముగుస్తాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 30 , 2025 | 11:44 PM