ROCK PULL: రాతిదూలం లాగుడు పోటీలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:49 PM
ఉగాది పర్వదినాన్ని పురస్కరిం చుకుని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత, గ్రామస్థుల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు పాల్గొన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పోటీలను ప్రారంభించారు.

చెన్నేకొత్తపల్లి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరిం చుకుని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత, గ్రామస్థుల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు పాల్గొన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పోటీలను ప్రారంభించారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన చెన్నప్ప వృషభాలు మొ దటి బహుమతి రూ. 50వేలు గెలుపొందాయి. గార్లదిన్నెకు చెందిన నరేశ వృషభాలు ద్వితీయ బహుమతి రూ. 40వేలు, బళ్లారికి చెందిన ఆనందరెడ్డి వృషభాలు మూడో బహుమతి రూ. 30వేలు, సోమలదొడ్డికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు నాలుగో బహుమతి రూ. 20వేలను సాధించాయి. నంద్యాలజిల్లా బేతంచెర్ల మండలం హుసేనాపురానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి వృషభాలు ఐదవ బహుమతి కింద రూ.10వేలు గెలుపొందాయి. బహుమతులను ఎస్‌ఐ సత్యనారాయణ చేతులమీదుగా అందజేశారు. టీడీపీకి చెందిన వడ్డే శ్రీనివాసులు, వడ్డే దుర్గా అనే సోదరులు అన్నదానం నిర్వహించారు. వివిద గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాతిదూలం పోటీలను ఆశక్తిగా తిలకించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....