GOD : ఘనంగా గావుల మహోత్సవం
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:04 AM
మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు.

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు. ఇందులో భాగంగా పోతలయ్య స్వామిని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తునతరలివచ్చారు. అలాగే ముష్టికోవెల గ్రామంలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు జ్యోతుల, బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. స్థానికంగా మహిళలు జ్యోతులు, బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....